దుబ్బాక ఉపఎన్నిక కి అభ్యర్థి ను ఖరారు చేసిన సీఎం కేసీఆర్

Tuesday, October 6th, 2020, 03:00:08 AM IST

KCR
తెలంగాణ రాష్ట్రం లో సర్వత్రా ఆసక్తి గా ఎదురు చూస్తున్న దుబ్బాక ఉపఎన్నిక అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చంశనీయము అయిన సంగతి తెలిసిందే. అయితే దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గం కి అభ్యర్థి గా దివంగత మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత పేరును సీఎం కేసీఆర్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే రామలింగ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లో క్రియాశీల పాత్ర పోషించిన విషయాన్ని సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీ కోసం అంకిత భావంతో పని చేశారు అని, దుబ్బాక నియోజక వర్గ అభివృద్ది కోసం తుది శ్వాస వరకు పని చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

అయితే రామలింగారెడ్డి కుటుంబం ఇటు కుటుంబంలో, అటు నియోజక వర్గ అభివృద్ది లో పాలు పంచుకుంది అని, నియోజక వర్గ ప్రజలతో ఆ కుటుంబానికి అనుబంధం ఉంది అని కేసీఆర్ అన్నారు. అయితే ఈ నియోజక వర్గం లో అభివృద్ది పనులు కొనసాగడానికి ఆ కుటుంబానికి చెందిన వారు ప్రాతినిధ్యం వహించడమే సమంజసం అని కేసీఆర్ అన్నారు. అయితే జిల్లాలోని నాయకులందరితో కూడా ఈ అంశం పై చర్చ జరిపిన తర్వాతే అభ్యర్థి పేరు ఖరారు చేసినట్లు వివరించారు.