బిగ్ న్యూస్: దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్…ఉత్కంఠ గా ఎదురుచూస్తున్న పార్టీలు!

Tuesday, November 10th, 2020, 08:32:50 AM IST

తెలంగాణ రాష్ట్రం లో దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం అయింది. అయితే ఉప ఎన్నిక కి సంబంధించిన పోలింగ్ ఈ నెల మూడు న జరగగా, నేడు ఫలితం కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఈ ఓట్ల లెక్కింపు కోసం సిద్దిపేట వద్ద పొన్నాల ఇందూరు ఇంజినీరింగ్ కాలేజ్ లో అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 315 కేంద్రాల్లో ఉప ఎన్నిక పోలింగ్ జరగగా ఇందులో 23 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

అయితే మొత్తం రెండు గదుల్లో 14 టేబుల్స్ వేయగా, 27 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది. అయితే మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఫలితం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉండగా అనంతరం ఈవీ ఎం మిషన్ లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. అయితే ఫలితం కోసం మూడు కీలక పార్టీలు అయిన తెరాస, కాంగ్రెస్, బీజేపీ లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే తెరాస కి బీజేపీ గట్టి పోటీ ఇచ్చినట్లు పలు చోట్ల చర్చలు జరుగుతున్నాయి.