దుబ్బాక లో మూడు గంటల వరకు నమోదు అయిన పోలింగ్ శాతం ఎంతో తెలుసా?

Tuesday, November 3rd, 2020, 03:47:03 PM IST

దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలు చోట్ల కరోనా వైరస్ నిబంధనలు పాటిస్తూ ఓట్లు వేస్తున్నారు. అయితే ఈ దుబ్బాక ఉపఎన్నిక అధికార ప్రతి పక్ష పార్టీ లకు సవాల్ గా మారిన సంగతి తెలిసిందే. నేడు జరుగతున్న ఈ పోలింగ్ లో భారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు దుబ్బాక లో 71.10 శాతం పోలింగ్ నమోదు అయింది. అయితే ఈ పోలింగ్ సాయంత్రం ఆరు వరకు కొనసాగనుంది.

ఈ పోలింగ్ ఒక పక్క ప్రశాంతం గా జరుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ పై దుష్ప్రచారం రావడం తో, ఉత్తమ్ కుమార్ డీజీపీ కి ఫిర్యాదు చేశారు. ఇది బీజేపీ నేత, రఘునందన్ మరియు హరీశ్ రావు ల పనే అంటూ ఆరోపించారు.అంతేకాక తమ అభ్యర్ధి శ్రీనివాస్ రెడ్డి తెరాస లో చేరనున్నారు అంటూ వీడియో క్రియేట్ చేసిన వారిపై సైతం ఉత్తమ్ కుమార్ ఫిర్యాదు చేశారు. పోలింగ్ అయ్యేలోపు వారిపై చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కోరారు.