మొదలైన దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్…చిట్టాపూర్ లో ఓటు వేసిన సుజాత

Tuesday, November 3rd, 2020, 08:30:16 AM IST

తెలంగాణ రాష్ట్రం లో దుబ్బాక ఉపఎన్నిక కి సంబంధించిన పోలింగ్ నేడు ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. అయితే పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఉప ఎన్నిక పోలింగ్ లో తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత దుబ్బాక లోని చిట్టాపూరు లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్లు వేసేందుకు వస్తున్న వోటర్లు మాస్క్ లను ధరించి, భౌతిక దూరం పాటిస్తున్నారు. ఈ పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది.

అయితే సాయంత్రం 5 గంటల నుండి 6 వరకు ప్రత్యేకంగా కొవిడ్ బాధితుల కోసం కేటాయించడం జరిగింది. వారి కోసం పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే మొత్తం 148 గ్రామాల్లో 315 పోలింగ్ బూత్ కేంద్రాలను ఏర్పాటు చేయగా పలు చోట్ల పోలీస్ బందోబస్తు ఎక్కువగా ఉన్నది. అయితే బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ తెరాస, బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ లు కీలకం కానున్నాయి. దుబ్బాక లో మొత్తం 1,98,807 ఓటర్లు ఉన్నారు.