బిగ్ న్యూస్: దుబ్బాక లో నవంబర్ 3 న సెలవు

Friday, October 23rd, 2020, 04:07:00 PM IST

దుబ్బాక ఉపఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికలో అధికార పార్టీ మరియు ప్రతి పక్ష పార్టీ లు గెలిచేందుకు తమ తమ రీతిలో సిద్దం అవుతున్నాయి. ఓవర్లను ఆకర్షించేందుకు రకరకాల స్పీచ్ లు మరియు ఉపన్యాసాలు మాత్రమే కాకుండా, గతంలో తాము చేసిన పనులను ప్రజలకు తెలుపుతూ ఓట్లను అభ్యర్దిస్తున్నారు. అయితే దుబ్బాక లో నవంబర్ 3 న సెలవు గా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు అందుకు తగిన జీఓ ను విడుదల చేసింది ప్రభుత్వం.

నవంబర్ 3 న ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటించింది. అయితే పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి, పంపిణీ కేంద్రాల ఏర్పాటుకు వినియోగించే ప్రభుత్వ భవనాలు మరియు విద్యా సంస్థలకి నవంబర్ రెండు మరియు మూడు తేదీల్లో సెలవు ప్రకటించడం జరిగింది. అయితే ఓట్ల లెక్కింపు నవంబర్ 10 న జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఆరోజు కూడా సెలవు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీస్ భద్రతతో ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల పాటు కీలక చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే పోలింగ్ కి ఒక్కరోజు ముందు ప్రచారం నిలిపివేయనున్నారు.