దుబ్బాక ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్ధి ఇతనే!

Thursday, October 8th, 2020, 02:01:33 AM IST


తెలంగాణ రాష్ట్రం లో దుబ్బాక నియోజక వర్గం ఉప ఎన్నిక విషయం లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధికార పార్టీ తప్పక మరోమారు గెలవాలని భావిస్తుండగా, కాంగ్రెస్ పార్టీ సైతం అదే తరహాలో ఆలోచన చేస్తోంది. ఈ ఎన్నిక తో తెరాస కి బుద్ది చెప్పాలని చూస్తోంది. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. దుబ్బాక ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేరు ఖరారు అయింది. అయితే ఇందుకు కీలక నేతలు సైతం అంగీకారం తెలిపారు. ఇప్పటికే బీజేపీ, తెరాస కి సంబంధించిన అభ్యర్థులు సైతం ఫైనల్ అయిన సంగతి తెలిసిందే.