బిగ్ న్యూస్: దుబ్బాక ఉప ఎన్నిక లో బీజేపీ విజయం

Tuesday, November 10th, 2020, 04:01:23 PM IST

దుబ్బాక ఉపఎన్నిక లో ఎట్టకేలకు బీజేపీ గెలిచింది. తెలంగాణ రాష్ట్రం లో దుబ్బాక ఉపఎన్నిక హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో బీజేపీ తరపున రఘునందన్ రావు అనూహ్య విజయం సాధించారు. తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత పై 1,470 ఓట్ల మెజారిటీ తో రఘునందన్ గెలుపొందారు. అయితే మొదటి రౌండ్ నుండి ఆధిక్యం కనబరిచిన బీజేపీ, 10 వ రౌండ్ నుండి తెరాస కూడా పోటాపోటీ గా ఢీ కొట్టింది అని చెప్పాలి. 20 వ రౌండ్ వరకు కూడా తెరాస, బీజేపీ నువ్వా నేనా అనేట్లు గా ఓట్లు వచ్చాయి.

చివరకు తెరాస విజయం ఖాయమని భావించినా బీజేపీ గెలుపొందింది. వరుసగా 20,21,22,23 రౌండ్ లలో బీజేపీ అడిక్యం కనబరిచి దుబ్బాక ను సొంతం చేసుకుంది. అయితే తెలంగాణ లో మరొక ఎమ్మెల్యే స్థానం చేజిక్కడం తో బీజేపీ శ్రేణులు రాష్ట్రంలో సంబరాలు జరుపుకుంతున్నారు.