దుబ్బాక ఉపఎన్నిక: జోరు కనబరుస్తున్న బీజేపీ… పదో రౌండ్ లో తెరాస ఆధిక్యం

Tuesday, November 10th, 2020, 01:42:27 PM IST

దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అయితే బీజేపీ తన జోరు కొనసాగిస్తూనే ఉంది. తొలి అయిదు, 8,9 రౌండ్ లలో బీజేపీ అదిక్యం కనబర్చగా, 6,7,10 రౌండ్ లలో తెరాస తన సత్తా చాటుతోంది. మొత్తానికి పదో రౌండ్ లో తెరాస 456 ఓట్ల ఆధిక్యం కనబర్చగా, మొత్తం పది రౌండ్లు పూర్తి అయ్యే సరికి బీజేపీ 3,734 ఓట్ల ఆధిక్యంలో ఉన్నది. తెరాస 28,049 మరియు కాంగ్రెస్ లకు 6,699 ఓట్లు రాగా, బీజేపీ కి పదో రౌండ్ ముగిసే సరికి 31,783 ఓట్ల తో ముందు వరుస లో ఉంది.

దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్ జరుగుతున్నంత సేపు తెరాస, బీజేపీ లు ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నాయి. బీజేపీ, తెరాస నుండి గెలుపు తథ్యం అని తెలుస్తోంది. అయితే ఇంకా రౌండ్లు మిగిలి ఉండటం తో మరింత ఉత్కంఠ కి లోనయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.