వైరల్ న్యూస్: కరెంటు పోల్ ఎక్కి మందుబాబు హల్ చల్…క్వార్టర్ ఇస్తేనే!

Sunday, February 23rd, 2020, 10:15:35 PM IST

ముప్పై అడుగుల కరెంటు పోల్ ఎక్కిన మందుబాబు క్వార్టర్ ఇస్తే కానీ కిందకు దిగను అని మొండికేసాడు. సికింద్రాబాద్ వద్ద, డీ మార్ట్ వద్ద ఇలియాస్ అనే వ్యక్తి కరెంటు స్తంభం ఎక్కి హల్ చల్ చేసాడు. మందు బాటిల్ ఇస్తేకాని కిందకు దిగాను అని డిమాండ్ చేసిన ఇలియాస్, మద్యం ఇవ్వకుంటే పక్కనే ఉన్న హైటెన్షన్ వైర్ తాకుతానని అక్కడున్న వారిని ఆందోళనకు గురి చేసాడు. పోలీసులకి ఈ విషయం అక్కడికి చేరుకోగా, వారు చెప్పినా వినలేదు.

అయితే కిందికి దూకి చనిపోతాడనే భయంతో పోలీసులు కింద పరదాలు అడ్డుపెట్టారు. ప్లాస్టిక్ పరదాలతో కింద స్థానికుల సాయంతో కొన్ని పరదాలు పోలీసులు సిద్ధం చేసారు. ఎంతకీ కిందకి దిగని ఇలియాస్ వైన్స్ షాప్ వద్దకి వెళ్లి క్వార్టర్ చూపిస్తే కానీ కిందకి దిగలేదు. స్తంభం కిందికి దిగి వచ్చాక తనను ఏమి అనకూడదని వారితో అన్నాడు. అయితే దానికి సరే అనడం తో ఇలియాస్ కిందికి దిగాడు.