మీరు మందుకొడితే.. వాళ్ళు ఇళ్ళకు చేరుస్తారట..!

Saturday, January 2nd, 2016, 02:43:50 PM IST

కొంతమంది బార్ కి వెళ్లి ఫుల్లుగా తాగుతారు. తరువాత అక్కడే పడిపోతారు. ఎలాగోలా లేచి డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి పోతుంటే.. యాక్సిడెంట్ జరిగితే.. ఇంకేమన్నా ఉన్నదా.. తాగి డ్రైవింగ్ చేయడం వలనే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక, పండగలు.. పబ్బాలు వచ్చినపుడు బార్.. రెస్టారెంట్ లు ఫుల్ అయిపోతాయి. బార్ కు వచ్చి తాగే మందుబాబులను సురక్షితంగా ఇంటికి చేర్చాల్సిన బాధ్యతను కూడా రెస్టారంట్ యాజమాన్యంఫై పెట్టబోతున్నది ప్రభుత్వం.

మందుబాబులు ఫుల్ గా తాగి పడిపోయిన సమయంలో వారిని సురక్షితంగా ఇంటికి చేర్చాలని.. బార్ అండ్ రెస్టారెంట్ లకు ఇచ్చే లైసెన్స్ లలో దీనిని కూడా చేర్చాలని ప్రభుత్వం అనుకుంటున్నది. మందుబాబులు చెల్లించే బిల్లును బట్టి వారికి రవాణ సదుపాయం కలిగించాల్సి ఉంటుంది. ఒకవేళ బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు కనుక రవాణ సదుపాయం కల్పించకపొతే.. సదరు బార్ లైసెన్స్ ను రద్దు చేసే అవకాశం ఉంటుందని తెలుస్తున్నది.