జీన్స్, టీషర్ట్స్ వేసుకోవద్దంటున్న హైకోర్ట్..!

Wednesday, October 21st, 2015, 11:31:22 PM IST

high-court
మధ్యప్రదేశ్ హైకోర్ట్ తాజాగా ఆసక్తికర ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలు అందరికీ కాదు.. కేవలం కోర్టు ఉద్యోగులు, సిబ్బందికి మాత్రమే కావడం విశేషం. తాజాగా న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వ మర్యాదను కాపాడేందుకు ఉద్యోగులందరూ ఫార్మల్ దుస్తులు ధరించాల్సిందిగా పేర్కొంది.

ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తూ.. విధులకు హాజరయ్యే అన్ని క్యాడర్ ఉద్యోగులు ఈ నియమాన్ని పాటించాలని సూచించింది. ఈ సందర్భంగా హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్ మాట్లాడుతూ.. విధినిర్వహణకు ఉద్యోగులు రంగురంగుల దుస్తుల్లో రావడం గమనించామని, ఇది న్యాయస్థానం గౌరవానికి భంగం కలిగించే అంశమని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో జీన్స్, టీషర్ట్స్, ప్రకాశవంతమైన డిజైన్లు ధరించి న్యాయస్థానానికి రావద్దని.. నల్ల ఫ్యాంటు, తెల్ల చొక్కా, నల్ల కోటు ధరించాలని సూచించారు. ఈ ఆదేశాలను ఆచరించకపోతే క్రమశిక్షణారాహిత్యం కింద చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం.