ప్రజలకు ముఖ్య గమనిక : ఈ నెలాఖరు వరకు ఎవరు కూడా బయటకు రావొద్దు – ఎందుకంటే…?

Friday, May 22nd, 2020, 06:55:28 PM IST

ఒకవైపు మహమ్మారి కరోనా వైరస్ దారుణంగా పెరుగుతూ, ప్రజలను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్న తరుణంలో ప్రజలందరూ కూడా గత కొంత కాలంగా వారి వారి ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా పడిపోయిన తరుణంలో, పరిస్థితిని గాడిలో పెట్టడానికి మే 18 నుంచి లాక్ డౌన్ 4.0లో కొన్ని సడలింపులు ఇచ్చారు. ఈ సడలింపులు కారణంగా ప్రజలు బయటకు వస్తున్నారు. వారి అవసరాలని స్వతహాగా తీర్చుకుంటూ, జాగ్రత్తలు వహిస్తున్నారు. కానీ ఇంతలోనే ప్రజలకు పొంచి ఉందన్న వార్త ప్రజలందరినీ కూడా తీవ్రమైన భయాందోళనకు గురిచేస్తుంది.

కాగా ఈ నెల 28 తేదీ వరకు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో మరింత ఎక్కివగా ఉంటుందని, వాటిలో ముఖ్యంగా కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. అయితే ఈ తరుణంలో రాష్ట్రంలో పలుచోట్ల వేడిగాలులు వీస్తాయని, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరూ కూడా బయటకు రావొద్దని అంటున్నారు. మహిళలు, పిల్లలు, వృద్దులు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులందరు కూడా ఇప్పటికే పలు హెచ్చరికలు చేస్తున్నారు.