బిగ్ న్యూస్: వాక్సిన్ ల పై గ్రేట్ న్యూస్ – డోనాల్డ్ ట్రంప్

Wednesday, July 15th, 2020, 11:04:51 PM IST


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బుధవారం సోషల్ మీడియా ద్వారా ఒక కీలకం విషయం ను వెల్లడించారు. ప్రపంచ దేశాలు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే గ్రేట్ న్యూస్ ఆన్ వాక్సిన్స్ అంటూ డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసారు. అయితే ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు వాక్సిన్ లకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే డోనాల్డ్ ట్రంప్ ప్రత్యేకించి సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం తో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఆక్స్ ఫోర్డ్ విశ్వ విద్యాలయం నుండి లైసెన్స్ పొందిన ఆస్త్రాజెన్ కా నుండి రేపు కొవిద్ 19 వాక్సిన్ పై ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. అయితే ట్రంప్ ఈ వాక్సిన్ కి సంబంధించి చేశారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అమెరికా లో ఇప్పటి వరకూ 35 లక్షలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, లక్ష నలభై వేల మంది వరకు కరోనా వైరస్ భారిన పడి మృతి చెందారు.