డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు… ట్వీట్ ను తొలగించిన ట్విట్టర్!

Wednesday, November 4th, 2020, 01:12:05 PM IST

donald trump

అమెరికా లో ఎన్నికల కౌంటింగ్ చాలా రసవత్తరంగా సాగుతోంది. అయితే ఈ నేపథ్యం లో అభ్యర్థుల మధ్య పోటీ గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాం అంటూ ఇరు వర్గాలు ధీమా గా ఉన్నాయి. అయితే దీని పై మీడియా సమావేశం ద్వారా బైడన్ మాట్లాడారు. విజయం తప్పక తమదే అంటూ తెలిపారు. అయితే డోనాల్డ్ ట్రంప్ సైతం దీని పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే సోషల్ మీడియాలో యాక్టిి వ్ గా ఉండే ట్రంప్ ట్విట్టర్ వేదికగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

భారీ విజయం దిశగా ఉన్నాం అని, వాళ్ళు మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని తెలిపారు. అలా జరగనివ్వం అని, పోలింగ్ తర్వాత ఓట్లు వేయడానికి ఒప్పుకొం అని అందులో తెలిపారు. అయితే ఈ పోస్ట్ లోని వ్యాఖ్యలు ఎన్నికలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి అంటూ ట్విట్టర్ ఈ ట్వీట్ ను తొలగించడం జరిగింది. ప్రస్తుతం బైడెన్ 224, ట్రంప్ 213 ఎలెక్టోరల్ ఓట్లు సాధించినట్లు తెలుస్తోంది. త్వరలో దీని ఫలితం వెలువడనుంది.