అమెరికా అద్యక్షుడు అవ్వగానే నేనిదే చేస్తా – ట్రంప్

Tuesday, November 22nd, 2016, 11:48:21 AM IST


అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంకా అధ్యక్షా పీఠం మీద కూర్చోక ముందరే తాను చెయ్యబోయే పనుల గురించి వరసపెట్టి చెప్పేస్తున్నాడు. ట్రాన్స్ పసిఫిక్ పార్టనర్ షిప్ ట్రేడ్ (టీపీపీ) డీల్ నుంచి అమెరికా వైదొలగుతుందని… అధ్యక్ష పదవివి చేపట్టగానే, తాను చేసే మొదటి పని ఇదేనని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఓ వీడియో సందేశం ద్వారా ఆయన వెల్లడించారు. 2015లో 12 దేశాలు టీపీపీ డీల్ కుదుర్చుకున్నాయి. దాదాపు నలభై శాతం ఆర్ధిక వ్యవస్థ ని తన వాటాలో పెట్టుకున్నాయి ఈ దేశాలు. ఇప్పటి వరకూ ఈ డీల్ ని కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, మలేషియా, మెక్సికో లు ఒప్పుకోలేదు. అమెరికా కూడా ఈ డీల్ నుంచి వెళ్ళిపోతే అర్ధం ఉండదు అంటున్నారు జపాన్ ప్రధాని.