ట్రంప్ భద్రతా సలహాదారునికి కరోనా పాజిటివ్!

Tuesday, July 28th, 2020, 02:12:05 AM IST


ప్రపంచ దేశాలను గడ గడ లాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏ ఒక్కరినీ కూడా వదలడం లేదు. అమెరికా లో ఈ వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. అక్కడే భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు అయిన డోనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి రాబర్ట్ ఓ బ్రెయిన్ కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే ఈ విషయాన్ని అక్కడి అధికారులు స్వయంగా వెల్లడించారు.

అయితే రాబర్ట్ ఓ బ్రెయిన్ కి కరోనా సోకిన విషయాన్ని వైట్ హౌస్ వర్గాలు సైతం వెల్లడించడం తో అధికారులు అప్రమత్తం అయ్యారు. అయితే ఓ బ్రెయిన్ కి స్వల్పంగా లక్షణాలు కనిపించడం తో అంతగా ప్రమాదం ఏమి లేదు అని చెబుతున్నారు.ప్రస్తుతం ఒక సురక్షితం గా ఉన్న ప్రదేశం లో స్వీయ నిర్బంధం లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఒక పెళ్లి వేడుక కు హజరు కావడం తో కరోనా సోకినట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకూ అమెరికా లో కరోనా వైరస్ సోకిన హై అధికారి ఇతనే అని చెప్పాలి. అయితే ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి అని అధికారులు చెబుతున్నారు.