తొలిసారి భారత్ మాటెత్తిన డోనాల్డ్ ట్రంప్

Wednesday, January 27th, 2016, 05:05:27 PM IST

trumpp3
రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న డోనాల్డ్ ట్రంప్ తొలిసారి తన ప్రసంగంలో భారత్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఏ దేశాన్నైనా నిర్మొహమాటంగా విమర్శించగల ట్రంప్ భారతదేశం గురించి అంత పాజిటివ్ గా మాట్లాడటం కాస్త విచిత్రాన్ని కలిగిస్తోంది.

ఆయన తన ప్రసంగం మొదలుపెట్టేటప్పుడు ‘భారత్ కృషి అద్బుతం. అదే భారత్ ఆరంభం. కానీ దాని అభివృద్ధి గురించి ఎవరూ మాట్లాడటం లేదు. అది ఇరాక్ అయినా, ఇండియా అయినా, జపాన్ అయినా, చైనా అయినా ఆర్ధిక పరిస్థితి విషయంలో వాటి గురించిన విషయాలు మాట్లాడుతున్నారు. కానీ గొప్ప శక్తిగా ఉండిన అమెరికా పరిస్థితి ఇప్పుడు బాగోలేదు. ఇది చాలా భాధాకరం. మనం గౌరవించబడటం లేదు’ అంటూ అమెరికా గురించి మాట్లాడారు.