ఇప్పటికీ ఎన్నికల ఫలితాలతో విభేదిస్తున్నా – ట్రంప్

Thursday, January 7th, 2021, 07:24:24 PM IST

donald trump

అమెరికా అధ్యక్ష పీఠం పై జరుగుతున్న వివాదం ఎట్టకేలకు ముగింపు పలికింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి అని ఇప్పటికే పలుసార్లు ఆరోపించిన డోనాల్డ్ ట్రంప్, తాజాగా ఓటమిని అంగీకరించారు. అమెరికా పార్లమెంట్ జో బైడెన్ గెలుపును ధృవీకరించారు. అయితే ఆ దేశ కాంగ్రెస్ తెలిపిన కొద్ది సేపటికే డోనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. తదుపరి అధ్యక్షుడు అయిన జో బై డెన్ కి అధికారాన్ని అప్పగిస్తా అంటూ చెప్పుకొచ్చారు.

అయితే డోనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికీ కూడా అధ్యక్ష ఎన్నికల ఫలితాలతో విభేదిస్తున్న విషయాన్ని వెల్లడించారు. అయినప్పటికీ నిబంధనల ప్రకారం జనవరి 20 న అధికార మార్పిడి కి సహకరిస్తా అని అన్నారు. ఫలితాల పై పోరాటం జరుగుతూనే ఉంటది అని, అధ్యక్ష చరిత్రలో ఇది మొదటి పర్యాయనికి ముగింపు కావొచ్చు కానీ, అమెరికా తన పూర్వ వైభవం సాధించేందుకు మేం చేసే పోరాటానికి ఇది ఆరంభం అంటూ, 2024 ఎన్నికల్లో కూడా అధ్యక్ష పదవికి పోటీ చేస్తా అంటూ పరోక్షంగా వెల్లడించారు.