కరోనా వైరస్ VS క్రికెట్

Friday, March 13th, 2020, 05:37:16 PM IST

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పలు చోట్ల జరగాల్సిన క్రికెట్ మ్యాచుల విషయంలో చాల మార్పులు సంభవించాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన అంశం ఐపీఎల్.

భారత్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఎనిమిది టీం లు కలిసి వివిధ దేశాలకు చెందిన ప్లేయర్లు కప్ కోసం ఆడే ఈ టోర్నమెంట్ మార్చి 29 కి ప్రారంభం కావాల్సి ఉండగా, ఆ తేదీ ని ఏప్రిల్ 15 వరకు మార్చవలసి వచ్చింది. దానికి కారణం కరోనా వైరస్ అని చెప్పాలి. ఇప్పటికే భారత్ లో కరోనా భారిన పడి వ్యక్తి మరణించడం తో పలు రకాల చర్యలు తీసుకుంటున్నారు.

రెండో అంశం ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ మధ్య జరుగుతున్నా వన్డే సిరీస్. అయితే మొట్ట మొదటిసారిగా ప్రేక్షకులు లేకుండా స్టేడియంలో ఆడిన ఆటగా మొదటి వన్డే రికార్డులకు ఎక్కింది. కరోనా వైరస్ విజృంభించడం తో ఈ వన్డే సిరీస్ మొత్తం ఇలా ఖాళీ స్టేడియాల్లో కొనసాగనుంది.

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ప్రారంభం అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా ఈ సిరీస్ ని వాయిదా వేయడం జరిగింది. మొదటగా ఈ సిరీస్ ని క్లోస్డ్ స్టేడియం లలో నిర్వహించాలని చూసినప్పటికీ యాజమాన్యం ఈ సిరీస్ ని వాయిదా వేయించడం గమనార్హం. లెజెండరీ క్రికెటర్ల తో కొనసాగే ఈ సిరీస్ మే లేదా అక్టోబర్ లో నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.

ఇంగ్లాండ్ శ్రీలంక పర్యటన, అయితే ఈ పర్యటన కాస్త కరోనా కారణం గా నిలిచిపోయింది. రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ ఆటగాళ్లు శ్రీలంక చేరుకోగా, కరోనా ప్రభావం కారణంగా తిరిగి యూకే కి ఆటగాళ్లు చేరుకోనున్నారు.

పాకిస్తాన్ సూపర్ లీగ్ కి సైతం తప్పని కరోనా కష్టాలు. ప్రభుత్వ సలహా మేరకు మిగిలిన సూపర్ లీగ్ మ్యాచులని క్లోజ్డ్ డోర్స్ వెనుక ఆడనున్నట్లు తెలుస్తుంది. అయితే మార్చ్ 13 నుండి జరగనున్న మ్యాచులు ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. అయితే పాకిస్తాన్ లో ఇప్పటివరకు 24 కరోనా కేసులు నమోదు కావడం విశేషం.

ఇండియా లో జరగాల్సిన రెండు మరియు మూడో వన్డే మ్యాచులు క్లోజ్డ్ డోర్స్ వెనుక జరగనున్నాయి. ప్రేక్షకులు లేకుండానే రెండు వన్డే మ్యాచులు జరగనున్నాయి. అయితే భారత్ లో రెండు వన్డే వన్డే మ్యాచులకి ఈ పరిస్థితి రావడం తో ప్రజలు కరోనా పట్ల మరింతగా ఆందోళన చెందే అవకాశం ఉంది.

సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా మహిళల జట్టుల మధ్య మార్చ్ 22 నుండి ఏప్రిల్ 4 వరకు జరగాల్సిన వన్డే సిరీస్ పర్యటన కరోనా కారణంగా ఆగిపోయింది. కరోనా కారణంగా క్రికెట్ అభిమానులు సైతం ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడుతుంది.