కుటుంబ పాలన, ప్రజాస్వామ్యానికి మధ్య పోటీ – డీకే అరుణ

Friday, November 27th, 2020, 07:30:53 PM IST

గ్రేటర్ ఎన్నికల ముందు అనేక మంది బీజేపీలో చేరుతుండడంతో ఆ పార్టీ పుల్ జోష్‌లో కనిపిస్తుంది. తాజాగా నేడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విక్రమ్‌గౌడ్ బీజేపీలో చేరిపోయారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, భూపేంద్రయాదవ్‌ సమక్షంలో విక్రమ్‌గౌడ్ బీజేపీ కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన డీకే అరుణ టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు.

గత ఆరేళ్లలో ప్రజలకు ఇచ్చిన ఏ హామీని టీఆర్‌ఎస్‌ నిలబెట్టుకోలేదని అన్నారు. మళ్లీ ఇప్పుడు టీఆర్ఎస్ మేతలు మాయమాటలు చెబుతున్నారని టీఆర్ఎస్ నాయకుల డ్రామాలను ఇక మీదట ప్రజలు నమ్మరని అన్నారు. టీఆర్ఎస్ ఎంఐఏం ఎత్తుగడలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పనిచేయవని అన్నారు. గ్రేటర్ ఎన్నికలలో కుటుంబ పాలనకు, ప్రజాస్వామ్యానికి మధ్య పోటీ ఉంటుందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదాను కూడా కాపాడుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు.