తెలంగాణ మంత్రి హరీశ్‌రావుకు మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సవాల్ విసిరారు. ప్రస్తుతం దుబ్బాక ఉపఎన్నికల ప్రచారంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే నేడు ప్రెస్‌మీట్ నిర్వహించిన డీకే అరుణ కేంద్ర నిధులపై సీఎం కేసీఆర్‌తో చర్చకు బండి సంజయ్ వస్తారని మంత్రికి సవాల్ విసిరారు.
అంతేకాదు కేంద్ర నిధులపై ఆర్థికమంత్రికి స్పష్టత లేకపోవటం నిజంగా సిగ్గుచేటు అని అన్నారు. హరీష్ రావు తన పేరును అరిచే రావుగా మార్చుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ అధికారం, డబ్బు బలంతో గెలవాలని చూస్తుందని, ఓటమి భయంతో హరీశ్‌రావు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. చెరుకు శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్‌లోకి పంపి టికెట్ ఇప్పించింది హరీశ్‌రావే అని అన్నారు. దుబ్బాకలో బీజేపీ కార్యకర్తల జోలికొస్తే టీఆర్ఎస్ అంతు చూస్తామని అన్నారు.