ఆర్జీవీ కార్యాలయం ఎదుట దిశ తండ్రి ధర్నా

Sunday, October 11th, 2020, 03:09:53 PM IST

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ వరుస చిత్రాలు చేస్తున్నారు. అయితే అదే విధంగా దిశ ఎన్ కౌంటర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రం పై అభ్యంతరాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ చిత్రం పై పలు విమర్శలు ఎదుర్కొన్న వర్మ, ఇప్పుడు మరొక సమస్య ఎదుర్కోనున్నారు. ఆర్జీవీ కార్యాలయం ఎదుట దిశ తండ్రి ధర్నా కి దిగడం జరిగింది. ఆదివారం ఉదయం దిశ తండ్రి రామ్ గోపాల్ వర్మ కార్యాలయం ఎదుట ధర్నా కి దిగారు. ఈ చిత్రం విడుదల నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్నారు.

ఇప్పటికే దిశ ఎన్ కౌంటర్ చిత్రాన్ని ఆపివేయాలని దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి హై కోర్టు ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం దిశ బయో పిక్ కాదు అని, నిజాలు చెప్తున్నాం అంటూ ఇది వరకే తెలిపారు.