ఆర్జీవి “దిశ ఎన్ కౌంటర్” సినిమా కి సెన్సార్ రిజెక్ట్ చేసిన కమిటీ

Thursday, February 4th, 2021, 04:12:26 PM IST

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ కి సెన్సార్ బోర్డు ఊహించని షాక్ ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న దిశ ఎన్ కౌంటర్ సినిమా కి సెన్సార్ ను రిజెక్ట్ చేసింది సెన్సార్ కమిటీ. అయితే ఇప్పుడు ఈ విషయం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. రామ్ గోపాల్ వర్మ నిజ జీవితంలో జరిగిన సంఘటనలను వాస్తవాలను, కాల్పనిక కథ లతో నిత్యం తెరకెక్కిస్తూనే ఉంటారు. ఇటీవలే మర్డర్ అనే సినిమా కూడా వివాదాస్పదం అయింది. ఎట్టకేలకు సినిమా విడుదల చేశారు వర్మ. అయితే ప్రతి విషయం లో ఏదో ఒక వివాదం అయినా, విడుదల చేస్తూనే వచ్చారు. అయితే మొదటి సారి సెన్సార్ రిజెక్ట్ చేయడం పట్ల పలువురు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో గోవిందా గోవిందా అనే చిత్రానికి చాలా వరకు సెన్సార్ కట్స్ ఉండటం తో అప్పుడు అలిగి ముంబై కి వెళ్ళారు వర్మ. మరొకసారి ఇప్పుడు అదే తరహాలో మొత్తం సినిమా రిజెక్ట్ అవ్వడం తో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

తెలంగాణ లో హైదరాబాద్ లో జరిగిన దిశ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. అందుకు కారకులైన వారిని ఎన్ కౌంటర్ చేశారు పోలీసులు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ చిత్రం లో చూపిస్తా అంటూ వర్మ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.