సినిమాను ఆపేయండి.. హైకోర్టును ఆశ్రయించిన దిశ నిందితుల కుటుంబసభ్యులు..!

Monday, November 2nd, 2020, 04:41:47 PM IST

వివాదస్పద సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ గత ఏడాది తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన దిశ హత్య కేసుపై సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఆ మూవీకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌, ట్రైలర్‌ని కూడా రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ ఏడాదు నవంబర్ 26 ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా వర్మ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమాని కేంద్రప్రభుత్వం, సెన్సార్‌ బోర్డు ఆపాలంటూ దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు.

అయితే తాజాగా ఈ సినిమాను ఆపాలంటూ దిశా నిందితుల కుటుంబసభ్యులు కూడా సుప్రీంకోర్టుకు సంబంధించిన జ్యూడీషియల్ కమీషన్‌ను ఆశ్రయించారు. ఈ సినిమాలో తమ వాళ్లను రౌడీలుగా చిత్రీకరిస్తున్నారని నిందితులు జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు, హైమ్మద్ ఆరీఫ్ కుటుంబసభ్యులు ఆరోపించారు. అయితే ఈ సినిమా చిన్నపిల్లలపై కూడా ప్రభావం చూపుతుందని, ఒక పక్క ఎంక్వయిరీ కొనసాగుతుంటే దిశ కథను ఎలా తెరకెక్కిస్తారని ఫిర్యాదులో ప్రశ్నించారు. అందుకే రామ్ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వెంటనే నిలిపి వెయ్యాలని కమీషన్‌ను కోరారు.