అందుకే ప్రభాస్ తో సినిమా చేస్తున్నా – ప్రశాంత్ నీల్

Friday, December 4th, 2020, 02:22:57 PM IST

సలార్ చిత్రం ను అనౌన్స్ చేయడం మాత్రమే కాకుండా, ప్రభాస్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసి సినిమా ప్రపంచాన్ని షాక్ కి గురి చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే కన్నడ సినీ పరిశ్రమ లో ఇప్పటికే ఉగ్రం, కేజీఎఫ్ చిత్రాలతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ తన సలార్ చిత్రనికి ప్రభాస్ ను తీసుకోవడం పట్ల, ఈ సినిమా గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలుగు సినీ పరిశ్రమ కి చెందిన హీరో ప్రభాస్ ను తీసుకోవడం పట్ల తనను చాలా మంది అడగడం తో క్లారిటీ ఇచ్చారు. తను రాసుకున్న సలార్ కథకి ప్రభాస్ సరిగ్గా సరిపోతాడు అని అనిపించింది అని తెలిపారు. అందుకే ఆయనతో సినిమా చేస్తున్నట్లు తెలిపారు. అయితే మిగతా విషయాలు సినిమా విడుదల అయ్యాక మాట్లాడతా అని తెలిపారు. అయితే సలార్ కి అర్ధం ఏవేవో చెబుతున్నారు అని, ఉర్దూ భాష ప్రకారం సలార్ అంటే ఒక సమర్థవంతమైన నాయకుడు అని అన్నారు. అంతేకాక రాజుకి కుడి భుజం లా ఉంటూ ప్రజల రక్షణ కోసం పాటుపడే వ్యక్తి అని కూడా చెప్పవచ్చు అని తెలిపారు.

ఓ వైలెంట్ పాత్రను మీ ముందుకు తీసుకు వస్తున్నా అని తెలిపారు. కథకి అద్దం పట్టేలా ఫస్ట్ లుక్ తీర్చి దిద్దాం అని అన్నారు. ప్రభాస్ లుక్ చూసి ఆర్మీ లో ఉండే వ్యక్తి అనుకుంటారు అనే పోస్టర్ తో పాటు టైటిల్ కూడా అనౌన్స్ చేసినట్ వివరించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ చేసిన వ్యాఖ్యలతో ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా, తెలుగు ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.