ఇప్పటి వరకు చూడని ప్రభాస్ ను చూస్తారు – ప్రశాంత్ నీల్

Thursday, December 3rd, 2020, 12:23:47 PM IST

యంగ్ రెబల్ స్టార్, బాహుబలి ప్రభాస్ వరుస సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్నాడు. అయితే సలార్ అంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ సినిమా లో ప్రభాస్ గెటప్ మరియు యాటిట్యూడ్ కి సంబంధించి దర్శకుడు ప్రశాంత్ నీల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ తో కలిసి పని చేసేందుకు ఎంతో థ్రిల్ కి గురి అవుతున్నా అని తెలిపారు. యాక్షన్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించేందుకు మేము సిద్దం అవుతున్నాం అని అన్నారు.ప్రేక్షకులు ఇప్పటి వరకు చూడని ప్రభాస్ ను ఒక కొత్త అవతారం లో చూస్తారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆ కొత్త ప్రభాస్ అభిమానులందరికీ కచ్చితంగా నచ్చుతాడు అని తెలిపారు.

కేజీఎఫ్ చిత్రం తో యశ్ లుక్ ను మాత్రమే కాకుండా, కన్నడ సినీ పరిశ్రమ ఫేట్ ను కూడా మార్చేశారు ప్రశాంత్ నీల్. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. అయితే ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం తరువాత, నాగ్ అశ్విన్ తో మరొక భారీ బడ్జెట్ చిత్రం ను చేయనున్నారు. సైన్స్ ఫిక్షన్ గా ఈ చిత్రం తెరకెక్కుతుందగా, ఓం రౌత్ తో ఆదిపురుష్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రభాస్. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సలార్ చిత్ర ప్రకటన తో అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.