ఇది థియేటర్లు తెరిచే సమయం అని అనిపిస్తుంది – నాగ్ అశ్విన్

Tuesday, September 29th, 2020, 06:12:46 PM IST

కరోనా వైరస్ మహమ్మారి భారత్ లో ప్రవేశించిన అనంతరం నుండి లాక్ డౌన్ కారణంగా అన్ని మూత పడ్డాయి. థియేటర్లు మూసివేత కారణంగా సినీ పరిశ్రమ చాలా నష్ట పోయింది. అయితే అన్ లాక్ ప్రక్రియ మొదలైనప్పటి కి ఇంకా థియేటర్లు తెరుచుకోలేదు. అయితే ఇదే విషయం పై తెలుగు సినీ పరిశ్రమ కి చెందిన దర్శకుడు నాగ్ అశ్విన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే జిమ్స్, బార్స్, రెస్టారెంట్స్, మాల్స్, దేవాలయాలు, బస్, ట్రైన్స్, మెట్రో తో పాటుగా విమాన సేవలు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే ఇప్పుడు థియేటర్లు కూడా తెరిచే సమయం అని అనిపిస్తుంది అంటూ నాగ్ అశ్విన్ అన్నారు. అయితే నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు సబబే అంటూ కొందరు అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం నాగ్ అశ్విన్ ప్రభాస్ తో తీస్తున్న సినిమా కు సంబంధించిన ఒక విషయం పై కామెంట్స్ చేస్తున్నారు.

బాలీవుడ్ లో డ్రగ్స్ కేసులో ప్రముఖ నటి దీపికా పడుకొనే ను విచారించిన సంగతి తెలిసిందే. అయితే అటువంటి హీరోయిన్ ను ప్రభాస్ సినిమా లో తీసుకోవద్దు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభాస్ 21 వ సినిమా కి దీపికా పడుకొనే ను ఫైనల్ చేస్తూ అధికారిక ప్రకటన వెలువడిన సంగతి అందరికీ తెలిసిందే.