రైతులను మోసం చేసింది చంద్రబాబే – ఏపీ ఉప ముఖ్యమంత్రి

Saturday, October 3rd, 2020, 03:02:12 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తాజా పరిణామాల పై ఉప ముఖ్యమంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులను మోసం చేసింది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల తో కలిసి ఉద్యమాలు చేయిస్తున్నారు అంటూ ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక అమరావతి రాజధాని పేరిట తన మనుషులతో చంద్రబాబు నాయుడు భూములు కొనిపించారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

అయితే విశాఖ లో రాజదాని వొద్దు అంటున్న తెలుగు దేశం పార్టీ నాయకులు తన పై పోటీ చేయగలరా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అచ్చెన్న మరియు ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎవరైనా ఉత్తరాంధ్ర నుండి పోటీ చేయాలని అనుకుంటే తను ఇప్పుడే రాజీనామా చేస్తా అంటూ సవాల్ విసిరారు. అయితే ఒక పక్క చంద్రబాబు నాయుడు వైసీపీ నేతల తీరును తప్పు బడుతూ 2022 లో జమిలి ఎన్నికలు అంటూ వరుస విమర్శలు చేస్తున్నారు.