బిగ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అయిన ధరణి సేవలు

Monday, November 2nd, 2020, 01:31:22 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సోమేష్ కుమార్ నేడు శంషాబాద్ తహశీల్దార్ కార్యాలయం లో ధరణి సేవలను ప్రారంభించారు. అయితే హైదరాబాద్ ప్రాంతంలో మినహా మిగతా, 570 మండలాల్లో ప్రజలకు అందుబాటులో ఈ సేవలు ఉండనున్నాయి. అయితే ఇప్పటి వరకూ 1.48 లక్షల ఎకరాలకు సంబంధించిన 59.46 లక్షల ఖాతాలు దరనిలో నిక్షిప్తం అయినట్లు తెలుస్తోంది. అయితే ఒకే సమయం లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరియు మ్యుటేషన్ లు పూర్తి అయ్యేలా సీఎం కేసీఆర్ ఈ పోర్టల్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కోసం 946 మంది నగదు చెల్లించగా, 888 మంది స్లాట్స్ బుక్ చేసుకున్నట్లు సోమేష్ కుమార్ వెల్లడించారు. అయితే ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా మీ సేవా కేంద్రాల్లో 200 రూపాయలతో స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు అని తెలిపారు. ఇందులో ఎటువంటి అవినీతికి చోటు లేకుండా, పారదర్శకంగా ఉండేలా స్పెషల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన విషయాన్ని వెల్లడించారు.