ధనుష్ పుట్టుక వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది గా ?

Monday, February 27th, 2017, 11:20:02 AM IST


ధనుష్ మా కొడుకంటే .. మా కొడుకు అంటూ పలువురు కోర్టుల్లో కేసులు వేస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా కదిరేశన్ దంపతులు వేసిన పిటిషన్ స్కూల్ టిసిలో పుట్టమచ్చలు పేర్కొన్నట్టే ఉండగా, ధనుష్ తరపు లాయర్ సమర్పించిన టిసి లో మాత్రం చెప్పినట్టు లేకపోవడంతో ధనుష్ కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది? అప్పట్లో ధనుష్ పెళ్లి సమయంలోనే ధనుష్ మా కొడుకు మాకు అప్పగించాలని పెద్ద కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ గొడవ సద్దు మణిగిందని అనుకున్నారు కానీ మళ్ళీ కదిరేశన్ దంపతులు ధనుష్ మా కొడుకంటు కోర్టులో దావా వేయడంతో రచ్చ మళ్ళీ మొదలైంది. ఈ నెల 28 లోగా కోర్టులో పుట్టమచ్చల కన్ఫర్మేషన్ ఇవ్వాలని కోర్టు వార్ణింగ్ ఇచ్చింది. కదిరేశన్ మధురై జిల్లాలోని మల్లంపట్టి గ్రామినికి చెందిన వాడు. ఓ ప్రయివేట్ బస్సు కండక్టర్. ధనుష్ తన కొడుకని, అసలు పేరు కలై సెల్వన్ అని పదో తరగతి వరకు మేళూరులోని ప్రభుత్వ పాఠశాలలో చదివాడని చెబుతున్నారు.