ఏపీ పోలీసులకు డీజీపీ సవాంగ్ వార్నింగ్.. ఓవర్ యాక్షన్ వద్దు..!

Wednesday, August 26th, 2020, 07:00:10 PM IST

dgp goutam savan

ఏపీ పోలీసులకు డీజీపీ గౌతం సవాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కరోనా సమయంలో కూడా పోలీసులు బాగా పని చేశారని ఒకరిద్దరు చేసిన పనులకు పోలీసు వ్యవస్థ మొత్తానికే చెడ్డ పేరు వస్తుందని అన్నారు. పేద, బడుగు బలహీన వర్గాలకు పోలీసులు అండగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, సేవ భావంతో పోలీసులు పని చేయాలని సూచించారు.

అయితే అనుకోని సంఘటనలు పోలీసులకు సమస్యలు తెచ్చి పెడుతున్నాయని, పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారన్న భావన ప్రజల్లో ఏర్పడిందని అలాంటిది తొలిగిపోవాలని అన్నారు. పోలీసులు తప్పు చేస్తే శాఖాపరమైన చర్యలతో పాటు న్యాయపరంగా కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మార్పు రావాలంటే ఖచ్చితంగా కఠినంగా ఉండక తప్పదని అన్నారు. రాబోయే 3 నెలల్లో పోలీసు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తామని, పోలీసు శాఖలో సమగ్రత, అవినీతి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పుకొచ్చారు.