మీ ధరల స్థిరీకరణ నిధిఎక్కడ.. వైసీపీకి దేవినేని ఉమా సూటి ప్రశ్న..!

Saturday, November 14th, 2020, 03:01:27 AM IST


వైసీపీ సర్కార్‌పై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. పత్తిపంట చేతికొచ్చినా జాడలేని సీసీఐ కొనుగోలు కేంద్రాలు, ప్రారంభించిన చోటా నాణ్యత పేరుతో కొనుగోలుకు నిరాకరణ, అసలే అధిక వర్షాలతో రైతులు దెబ్బతిన్నారని, దళారుల దోపిడితో క్వింటాలుకు 3వేలు కూడా దక్కడంలేదని మీరు చెప్పిన ధరలస్థిరీకరణ నిధిఎక్కడ ఉందని, మద్దతుధరకు ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడంలేదని ప్రశ్నించారు.

ఇక కొత్తవిద్యుత్ ఒప్పందాలతో విద్యుత్ సంస్థలపై 2,250 కోట్లభారం పడనుందని, 10 వేల మెగావాట్ల సగటు విద్యుత్ వాడకానికి ఇప్పటికే 20 వేల మెగావాట్ల ఒప్పందాలు, భవిష్యత్తులో రేట్లు తగ్గి నష్టాలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారని, 25ఏళ్ల పిపిఏలను తీవ్రంగా వ్యతిరేకించి నేడు 30ఏళ్ళ పిపిఏలు ఎలా కుదుర్చుకుంటున్నారని నిలదీశారు.