ఏబీఎన్‌కి జగన్‌ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు.. దేవినేని ఉమ సూటి ప్రశ్న..!

Thursday, January 28th, 2021, 05:36:54 PM IST

ఏపీలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ప్రసారాలను నిలిపివేయడంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, మరో ఛానల్‌ను రాష్ట్ర వ్యాప్తంగా రాకుండా కేబుల్ యాజమాన్యాన్ని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని దేవినేని ఆరోపించారు. ఏబీఎన్‌కి అసలు జగన్‌ రెడ్డి ఎందుకు భయపడుతున్నారో సమాధానం చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు.

అయితే మీ ప్రభుత్వ చేస్తున్న అవినీతి అక్రమాలను చెపుతున్నందుకేనా ఛానళ్లను ఆపుతున్నారని, యాడ్ల రూపంలో సాక్షి మీడియాకు కోట్ల రూపాయలు ఇస్తున్నారని ఆరోపించారు. మీ ప్రభుత్వానికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఏబీఎన్ ఛానల్‌ ప్రసారం చేయాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. ఏబీఎన్ ప్రసారాలు ఆపకుంటే, విద్యుత్‌ స్తంభాలకు మీ కేబుళ్లు ఉండవు వైసీపీ నేతలు కేబుల్ యాజమాన్యాలను హెచ్చరించడం సిగ్గుచేటని అన్నారు.