ఆయన మాటలు మీకు వినబడుతున్నాయా.. జగన్‌కి దేవినేని ఉమా సూటి ప్రశ్న..!

Wednesday, August 19th, 2020, 01:00:02 PM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీనిపై స్పందించిన టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 3,06,261 కరోనా కేసులు, 2820 కరోనా మరణాలు నమోదు అయ్యాయని, దేశంలో మూడు లక్షలు దాటిన మూడో రాష్ట్రంగా ఏపీ రికార్డుల్లోకి ఎక్కిందని అన్నారు.

అయితే 11 రోజుల్లోనే మూడో లక్ష కూడా నమోదు అయ్యిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతుందని, కేసుల పెరుగుదలలో ఏపీ మొదటి స్థానంలో ఉంది అని అన్నారు. దేశంలో 10 వేల కేసులు దాటిన 50 జిల్లాలలో 13 మన ఏపీలోనే ఉండడం విశేషం అని, కరోనా వారియర్స్ తో మాట్లాడి ప్రజలకు మనోధైర్యం కల్పించాలన్న చంద్రబాబు గారి మాటలు మీకు వినబడుతున్నాయా జగన్ గారు అంటూ ప్రశ్నించారు.