తప్పులను ప్రశ్నిస్తే చంపేస్తారా.. వైసీపీ సర్కార్‌పై దేవినేని ఉమ ఫైర్..!

Wednesday, February 3rd, 2021, 06:16:20 PM IST

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మరోసారి మండిపడ్డారు. ప్రజావ్యతిరేఖతకు భయపడే తొలిదశ ఎన్నికల్లో వైసీపీ బెదిరింపులు, దౌర్జన్య కాండ మొదలుపెట్టిందని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిని బయటపెడితే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. పటాభిరాంపై హత్యాయత్నం ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అని, తప్పులను ప్రశ్నిస్తే చంపేస్తారా? మీ బెదిరింపులు, దాడులకు తెదేపానేతలు, కార్యకర్తలు భయపడబోరని అన్నారు.

అంతేకాదు ప్రజాబలం ఎదుర్కోలేక వందలమంది పోలీసులతో
అచ్చెన్నాయుడిని అరెస్ట్ చెయ్యడం ప్రభుత్వ దుర్మార్గచర్య అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమిభయంతో భయబ్రాంతులకు గురి చేయాలనే ఈ దుందుడుకు చర్యకు పాల్పడ్డారని దేవినేని అన్నారు. అచ్చన్నపై కక్షసాధింపు చర్యలకు మూల్యం చెల్లించక తప్పదని దేవినేని హెచ్చరించారు.