బాధ్యత లేకుండా మాట్లాడకు.. మంత్రి అనిల్‌పై దేవినేని ఉమా ఫైర్..!

Monday, October 26th, 2020, 11:00:15 PM IST

ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. పోలవరంపై మంత్రి అనిల్ బాధ్యత లేకుండా మాట్లాడరని అన్నారు. టీడీపీ హయాంలో పోలవరం పనులు 71.02 శాతం పూర్తయ్యాయని ఒప్పుకున్నారని అన్నారు. అయితే పోలవరం ఉనికిపై సీఎం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. పోలవరం అంచనాలపై వైసీపీ తప్పుడు ప్రచారంతోనే నష్టం జరిగిందని అన్నారు.

అయితే 2017-18 రేట్ల ప్రకారం పోలవరం అంచనాలు 57,297 కోట్లు అని అన్నారు. డీపీఆర్‌-1 కు, డీపీఆర్‌-2కు ముంపు పెరిగిందని అందుకే పరిహారం కూడా పెరిగిందని అన్నారు. కేంద్రం ప్రశ్నలకు సమాధానం చెబితే 55,548 సాంకేతిక కమిటీ ఆమోదం తెలిపిందని చెప్పుకొచ్చారు. పోలవరంలో ఇరిగేషన్‌తో పాటు పునరావాసం ఖర్చు కూడా భరిస్తామని గతంలో కేంద్రం ఒప్పుకుందని, గడ్కరీ ప్రాజెక్ట్ వద్దకు వచ్చినప్పుడు కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారని అన్నారు.