వారిపై కేసులు పెట్టడం దుర్మార్గం.. వైసీపీపై మండిపడ్డ దేవినేని ఉమా..!

Saturday, January 16th, 2021, 03:01:15 AM IST


వైసీపీ ప్రభుత్వ వైఖరిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఆలయాలపై దాడుల ఘటనలలో నిందితులను పట్టుకోలేని ప్రభుత్వం, సోషల్ మీడియాలో పోస్ట్ లు ఫార్వర్డ్ చేసినవారిపై కేసులుపెట్టడం దుర్మార్గమని అన్నారు. చంద్రబాబు హయాంలో సమర్ధవంతంగా పనిచేసి పేరుతెచ్చుకున్న అధికారులు నేడు తాడేపల్లి రాజప్రసాదం నుంచి జగన్ ఇచ్చే ఆదేశాలను పాటించడానికే పరిమితమై ప్రతిష్టనుమసకబార్చారని అన్నారు.

అంతకు ముందు సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌ను వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పుల కార్పొరేషన్‌గా చేశారని, తీసుకోవడమేగానీ చెల్లించేదిలేదు, కార్పొరేషన్ అప్పును 18 నెలల్లో 32 వేల కోట్లకు చేర్చారు? 344 కోట్ల అప్పు కోసం రేషన్ కార్డులు తొలగించి పన్నుల మోత మోగించారు. ప్రభుత్వం రైతులకివ్వాల్సిన ధాన్యం బకాయిలు 2486 కోట్లు ఎప్పుడు ఇస్తారు అని దేవినేని ప్రశ్నించారు.