ప్రజలు ఓట్లేసింది అందుకు కాదు.. దేవినేని ఉమా మండిపాటు..!

Tuesday, November 24th, 2020, 03:00:51 AM IST


వైసీపీ సర్కార్‌పై మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ గురుంచి మాట్లాడుతూ నవంబర్ కల్లా పోలవరం గేట్లు పెడతానన్న జగన్ వాటిని ఎక్కడ పెట్టారో చూపాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఓట్లేసి గెలిపించింది అయ్యల విగ్రహాలు పెట్టుకోవటానికి కాదని అన్నారు. పోలవరం గురించి జగన్‌కు మాట్లాడే దమ్ములేక మంత్రులతో బూతులు తిట్టిస్తున్నారని ఆరోపించారు. బెట్టింగ్‌లు కాసేవాళ్లు కూడా తమను విమర్శిస్తుండడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే పోలవరం వెళ్లకుండా వామపక్ష నేతలను అడ్డుకున్నారని విమర్శలు చేశారు.