కేసుల భయంతోనే జగన్ కేంద్రాన్ని ఎదురించడంలేదు – దేవినేని ఉమా

Saturday, October 31st, 2020, 06:59:29 AM IST

ఏపీలోని పోలవరం ప్రాజెక్టుపై గత కొద్ది రోజుల నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే నేడు నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ టీడీపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే మంత్రి అనిల్ వ్యాఖ్యలను మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా తప్పుపట్టారు. పోలవరం గురించి మంత్రులు వాస్తవాలు తెలుసుకోకుండా బూతులు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.

అయితే మంత్రులతో బూతులు మాట్లాడిస్తే ప్రాజెక్ట్ పూర్తికాదని, పోలవరం పనులు 71.02 శాతం జరిగాయని వైసీపీ ప్రభుత్వంలోని అధికారులే చెప్పారని గుర్తు చేశారు. పోలవరం పూర్తి అంచనా వ్యయం రూ.55,548 కోట్లకు కేంద్రం ఆమోదించిందని, అయితే గతంలో ఆమోదించిన వ్యయంపై జగన్ ఎందుకు కేంద్రంతో గట్టిగా మాట్లాడలేకపోతున్నారని అన్నారు. కేసుల భయంతోనే జగన్ కేంద్రంపై పోరాటం చేయడం లేదని అన్నారు. 17నెలల్లో 1%పని చేయకుండా, 28 మంది ఎంపీలుండి ఏం చేశారని, 2021 జూన్ కల్లా పోలవరాన్ని పూర్తిచేస్తామని అసెంబ్లీలో చెప్పారుకదా జగన్ గారు అని ప్రశ్నించారు.