వైసీపీ దౌర్జన్యాలు పెరిగిపోయాయి.. దేవినేని ఉమా సీరియస్..!

Tuesday, September 1st, 2020, 02:24:18 PM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక దౌర్జన్యాలు పెరిగిపోయాయని టీడీపీ నేత దేవినేని ఉమా మండిపడ్డారు. టీడీపీ నేతల బృందంపై మైనింగ్ మాఫియా దాడి చేసిందని వైసీపీ నేతల ఆగడాలకు అంతే లేకుండా పోతుందని అన్నారు. నందిగామలో ఇసుక మాఫియాను ప్రశ్నించిన విలేకరి గంటా నవీన్‌ను దారుణంగా హత్య చేశారని విమర్శలు గుప్పించారు.

కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌ను పరిశీలిస్తున్న టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ బృందం, సజ్జా అజయ్ పై మైనింగ్ మాఫియా దాడి చేసిందని, వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌ చూస్తుండగానే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. పంచభూతాలను సైతం మింగేస్తున్నారని చంద్రబాబు అన్నారని, మీ ప్రజాప్రతినిధి దోపిడీ, దౌర్జన్యాలపై ఏం చర్యలు తీసుకుంటారు జగన్ గారు అంటూ ప్రశ్నించారు.