హీరో రామ్ పోతినేనికి బెదిరింపులా.. జగన్ సర్కార్‌పై దేవినేని ఫైర్..!

Tuesday, August 18th, 2020, 10:31:27 AM IST

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ ఘటనపై హీరో రామ్ పోతినేని వరుస ట్వీట్లు ఇప్పుడు చర్చానీయాంశగా మారాయి. ఈ ఘటనపై రమేశ్ ఆసుపత్రిని నిందించడం సరికాదని, ఒక వేల ప్రభుత్వం అక్కడ కోవిడ్ సెంటర్ నిర్వహిస్తే ప్రభుత్వానిది తప్పు అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. ఆ తరువాత విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు రామ్ పై మండిపడ్డారు. ఈ కేసు విచారణకు ఆటంకం కలిగిస్తే రామ్‌కు కూడా నోటీసులు ఇస్తామని హెచ్చరించారు.

అయితే దీనిపై స్పందించిన టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా 32 ఏళ్లుగా 2 వేలకు పైగా సిబ్బందితో నెలకి 20వేల ఓపీ, 1500పైగా ఇన్ పేషెంట్స్ కి సేవలు. 1,25,000 పైగా cath, 20 వేలకు పైగా శస్త్రచికిత్సలు చేస్తూ రమేశ్ హాస్పిటల్స్ ఎంతో మంది ప్రాణాలు కాపాడుతుందని, ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిన రామ్ కు బెదిరింపులా అని ప్రశ్నించారు. ఎంతో మందికి ప్రాణదాత అయిన రమేష్‌ను అరెస్టు చేసేందుకు ప్రభుత్వానికి ఎందుకంత ఉత్సాహం అని నిలదీశారు.