ఆ వేలకోట్ల దోపిడీ పై ఏం చర్యలు తీసుకున్నారు జగన్ గారూ?

Tuesday, October 6th, 2020, 09:17:01 PM IST


అధికార పార్టీ వైసీపీ పాలనా విధానం పై తెలుగు దేశం పార్టీ నేతలు వరుస విమర్శలు చేస్తూనే ఉన్నారు. వైసీపీ అధికారం చేపట్టిన అనంతరం నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇసుక కొరత అంశం పై ప్రధానం గా పలు సమస్యలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఇసుక కొరత ఉద్యమాలు కూడా జరిగాయి. అయితే కాంట్రాక్టర్ లు ఈ ఇసుక విషయం లో అక్రమం, అవినీతి జరగుతుంది అని తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇసుక రీచ్ నుండి డిపో కు, అక్కడి నుండి ప్రజలకు రెండు విడతల్లో రవాణా, ఎత్తుడు మరియు దింపుడు తో కాంట్రాక్టర్ లకు కాసులు, వినియోగ దారుల నెత్తిన పిడుగులు, 16 నెలలు గా ప్రజలకు ఇసుక కష్టాలు అంటూ దేవినేని ఉమా చెప్పుకొచ్చారు. నేతల చేతుల్లోనే రవాణా కాంట్రాక్ట్, లక్షల టన్నుల అనధికారిక తరలింపు తో మీ నేతల వేలకోట్ల దోపిడీ పై ఏం చర్యలు తీసుకున్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అంటూ దేవినేని ఉమా సూటిగా ప్రశ్నించారు. అయితే అందుకు సంబంధించిన పూర్తి ఆర్టికల్ ను సైతం జోడించి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.