మీ ప్రజాప్రతినిధి అవినీతి పై ఏం చర్యలు తీసుకుంటారు?

Wednesday, January 27th, 2021, 02:49:27 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికల కి గ్రీన్ సిగ్నల్ రావడంతో అభ్యర్థుల కోసం ఆయా పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. అయితే పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయం లో ఆయా పార్టీలు వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రత్యర్థి పార్టీ నేతలు వరుస ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ మేరకు తెలుగు దేశం పార్టీ కి చెందిన కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా అధికార పార్టీ తీరు పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

50 లక్షలు ఇస్తేనే సర్పంచ్ సీటు, సొమ్ము ముందుగా మా చేతికి ఇవ్వాల్సిందే, మైలవరం స్థానిక సంస్థల ఎన్నికల్లో బామ్మర్ది బేరసారాలు అంటూ దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నియోజక వర్గంలో దోచుకున్నది చాలక ఇంకెంత ఖర్చు పెడతావ్ అంటూ సీట్లు అమ్ముకుంటున్న మీ ప్రజా ప్రతినిధి అవినీతి పై ఏం చర్యలు తీసుకుంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ దేవినేని ఉమా సూటీగా ప్రశ్నించారు. అయితే ఆ విషయం కి సంబంధించిన వార్త పత్రుల ను పోస్ట్ చేస్తూ జోడించారు.