సీఎం జగన్ కి సూటి ప్రశ్న వేసిన దేవినేని ఉమా

Monday, November 16th, 2020, 06:42:14 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ వైసీపీ కి మరియు ప్రతి పక్ష పార్టీ టీడీపీ కి మధ్య లో మాటల ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. వైసీపీ నేతలు టీడీపీ తీరును తీవ్ర స్థాయిలో ఎండగడుతూ ఘాటు విమర్శలతో రెచ్చిపోతున్నారు. అయితే అందుకు కౌంటర్ గా తెలుగు దేశం పార్టీ కీలక నేత, దేవినేని ఉమా వైసీపీ తీరును ఎండగడుతూ సీఎం జగన్ కి ఒక సూటి ప్రశ్న వేశారు.

మైలవరం లో సెంటు పట్టా పేరుతో లోతట్టు ప్రాంతాల్లో భూముల కొనుగోలు లో భారీ అవినీతి, మేరకు పేరుతో అక్రమ గ్రావెల్ తవ్వకాలతో వందల కోట్ల దోపిడీ, అక్రమం లోనూ ఉపాధి హామీ నిధులను వదలని మైలవరం కృష్ణుడు అని, మైనింగ్ సెస్ ఎగవేతతో కోట్ల స్వాహా అని దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే మీ ప్రజా ప్రతినిధి, బందువుల దోపిడీ పై ఏం చర్యలు తీసుకున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికే భూ ఆక్రమణ ల విషయం లో ఒకరి పై మరోకరు వరుస విమర్శలు చేస్తుండగా, ఇప్పుడు దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతల్లో ఆందోళన ను కలిగిస్తుంది.