వాటిపై సీబీఐ విచారణ కోరి వెనుక ఎవరున్నారో చెప్పే ధైర్యం ఉందా జగన్?

Wednesday, November 11th, 2020, 10:39:08 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం ప్రకటించిన అనంతరం పెను మార్పులు సంభవించాయి. అమరావతి లో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ వచ్చిన విషయాల పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానుల్లో విశాఖ పరిపాలనా రాజధాని అంశం పై టీడీపీ నేతలు వరుస విమర్శలు చేయడం మాత్రమే కాకుండా, భూ దందా కూడా అక్కడ జరుగుతోంది అంటూ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు.

విశాఖ లో అడ్డగోలుగా ఆక్రమణలు, బెదిరింపులు, భూ దందాలు అంటూ దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. ప్రతి భూ దందా వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారు అని, నాడు నేడు లో అవినీతి రాజ్యమేలుతోంది అని నేడు మీ నాయకులే చెప్తున్నారు అంటూ దేవినేని ఉమా చెప్పుకొచ్చారు. అంతేకాక అందుకు సంబంధించిన పలు విషయాలను సైతం పత్రికల్లో ప్రచురణ అయిన వాటిని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అయితే 17 నెలల్లో విశాఖ లో జరిగిన భూలావాదేవీలు, దందాల పై విచారణ కోరి వెనుక ఎవరున్నారో చెప్పే ధైర్యం ఉందా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ దేవినేని ఉమా రాష్ట్ర ముఖ్యమంత్రి ను సూటిగా ప్రశ్నించారు.