భవిష్యత్ లో నాకు ఏం జరిగినా సీఎం జగన్ దే బాధ్యత

Saturday, September 5th, 2020, 02:09:41 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార వైసీపీ పార్టీ మరియు తెలుగు దేశం పార్టీ నేతలు ఒకరి పై మరొకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగు దేశం పార్టీ కి చెందిన దేవినేని ఉమా పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన గురించి మాట్లాడే తప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. అయితే మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపుతా అంటూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ కాగా, దీని పై దేవినేని ఉమా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

కొడాలి నాని చేసిన వ్యాఖ్యల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొడాలి నాని తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సీఎం జగన్ మోహన్ రెడ్డి పైన పలు ఆరోపణలు చేశారు. సీఎం జగన్ ప్రోద్బలం తోనే కొడాలి నాని ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను డీజీపీ సు మోటో గా తీసుకొని, అందుకు తగ్గట్టు గా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే భవిష్యత్ లో తనకు ఏం జరిగినా కూడా సీఎం జగన్ దే బాధ్యత అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చంశనీయం అయ్యాయి.