టచ్ చేసి చూడు.. మంత్రి కొడాలి వ్యాఖ్యలకు దేవినేని ఉమ స్ట్రాంగ్ కౌంటర్..!

Tuesday, January 19th, 2021, 02:07:53 AM IST

Devineni Uma Kodali Nani

వైసీపీ మంత్రి కొడాలి నాని, టీడీపీ నేత దేవినేని ఉమ మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తుంది. తాను పేకాట ఆడిస్తున్నానని దేవినేని ఉమా ఆరోపణలు చేస్తున్నాడని, ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఆపకపోతే ఇంటికెళ్లి బడిత పూజ చేస్తానని మంత్రి కొడాలి నాని ఉమను హెచ్చరించారు. అయితే మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా రేపు ఉదయం 10 గంటలకు గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తానని దేవినేని ఉమ ప్రకటించారు.

అయితే జగన్ వచ్చి టచ్ చేస్తారా లేక బూతుల మంత్రిని పంపుతారో తేల్చుకునేందుకు సిద్ధమని దమ్ముంటే వచ్చి నన్ని టచ్ చేసి చూడండి అంటూ ఉమ సవాల్ విసిరారు. పోరంబోకు మంత్రి పోరంబోకు మాటలకు ప్రజలే సమాధానం చెబుతారని, ముందు బాబాయ్‌ని ఎవరు హత్య చేశారో జగన్‌ని నిలదీసే ధైర్యం మంత్రి కొడాలికి ఉందా అని ప్రశ్నించారు. సిగ్గు శరం ఉంటే రూ.2 వేల కోట్లు ధాన్యం కొనుగోళ్ల డబ్బులు రైతులకు ఇప్పించాలని సూచించారు. సీఎం జగన్ అమిత్‌ షా కాళ్ళు పట్టుకునేందుకు ఢిల్లీ వెళ్తున్నారా అని ప్రశ్న్సించారు.