ఏపీ మంత్రి కొడాలి నానికి షాక్.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..!

Saturday, September 12th, 2020, 12:14:38 AM IST


ఏపీ మంత్రి కొడాలి నానికి షాక్ తగిలింది. ఇటీవల మంత్రి కొడాలి నాని, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తనపై బెదిరింపులకు పాల్పడ్డారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తాజాగా తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అయితే బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి అసభ్య పదజాలంతో మాట్లాడుతూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని మండిపడ్డారు. తమను తమ పార్టీ అధినేతను ఒళ్లు దగ్గర పెట్టుకోవాలంటూ లేదంటే లారీతో యాక్సిడెంట్ చేసి చంపేస్తా అని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కుట్రలో సీఎం జగన్‌కు కూడా భాగం ఉందని ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని ఆరోపించారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే వైకాపా నాయకులకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.