వాటిపై సీబీఐ విచారణ అడిగే ధైర్యం ఉందా జగన్?

Monday, December 21st, 2020, 03:17:52 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పై మరొకసారి తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేదల ఇంట్లో వైసీపీ నేతల కాసులవేట, ఇళ్ళ స్థలాల పథకంలో అడుగడుగునా అవినీతి, వైసీపీ నాయకుల జేబులు నింపుతున్న స్థలాల చదును పనులు అంటూ దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూముల నుండి తెచ్చిన మట్టిని కొనుగోలు చేసినట్లు చూపి వందల కోట్ల రూపాయలు స్వాహా అంటూ సంచలన ఆరోపణలు చేశారు. భూ సేకరణ మరియు మెరక పనుల్లో మీ ప్రజా ప్రతినిధుల కుంభకోణాల పై సీబీఐ విచారణ అడిగే ధైర్యం ఉందా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అంటూ దేవినేని ఉమా సూటిగా ప్రశ్నించారు.

అయితే దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలకు తగు పోస్టుల ను జత చేశారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలోని పలు అంశాల పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న దేవినేని ఉమా ను టార్గెట్ చేస్తూ గతం లో పలువురు వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే మరొకసారి దేవినేని ఉమా చేసి ఆ వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.