బూతుల మంత్రులతో మాట్లాడిస్తున్నారంటే ఛాలెంజ్ కి స్పందించే ధైర్యం లేనట్టేనా?

Friday, December 18th, 2020, 09:18:07 AM IST

వైసీపీ నేతలు చేస్తున్న ఘాటు వ్యాఖ్యలకి తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా స్పందించారు. వైసీపీ నేతల పై, మంత్రుల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనభేరి తో ప్రాంతాలకతీతంగా ప్రజలు అమరావతికి జై కొట్టారు అని ఉమా పేర్కొన్నారు. అయితే జనభేరి తో వైసీపీ మూడు ముక్కలాటకు తెరపడినట్లే అని ఉమా విమర్శించారు. అయితే అమరావతి రిఫరెండం గా ఎన్నికలకి వెళ్దామన్న నారా చంద్రబాబు నాయుడు సవాల్ ను స్వీకరించే దమ్ముందా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే బూతుల మంత్రులతో మాట్లాడిస్తున్నారు అంటే ఛాలెంజ్ కి స్పందించే ధైర్యం లేనట్టేనా అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ను సూటిగా ప్రశ్నించారు.

అమరావతి కి మద్దతు తెలుపుతూ రాజదాని ప్రాంత ప్రజలతో పాటుగా పలు ప్రాంతాల నుండి ప్రజల మద్దతు లభిస్తోంది అని టీడీపీ నేతలు చెబుతుండగా, వైసీపీ నేతలు మాత్రం టీడీపీ తీరును విమర్శిస్తూనే ఉన్నారు.